ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య | Woman Commits Suicide When Forced Marriage In Kurnool | Sakshi
Sakshi News home page

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య

May 25 2018 11:55 AM | Updated on Nov 6 2018 8:16 PM

Woman Commits Suicide When Forced Marriage In Kurnool - Sakshi

మృతి చెందిన వెంకటేశ్వరి

మహానంది: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని స్థానిక ఈశ్వర్‌ నగర్‌లో గజ్జల వెంకటేశ్వరి (19)అనే యువతి గురువారం ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు. వివరాలు.. వెంకటేశ్వరికి తల్లిదండ్రులు ఏడాది క్రితం సమీప బంధువుతో పెళ్లి నిశ్చయించారు. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కుటుంబ సభ్యులతో చెబుతుండేది.

వాళ్లు సర్ధిచెబుతూ వచ్చారు. తన మాట వినడంలేదని తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేస్తున్నామని ఎస్‌ఐ  తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement