ప్రియుడితో కలిసి భర్త హత్య | Wife Killed Husband in Chittoor | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్త హత్య

Jun 5 2018 8:36 AM | Updated on Jun 5 2018 8:36 AM

Wife Killed Husband in Chittoor - Sakshi

నిందితులను అరెస్ట్‌ చూపుతున్న డీఎస్పీ, సీఐ

పెద్దమండ్యం : మండలలోని బండమీదపల్లె పంచాయతీ తురకపల్లెలో హంద్రీ–నీవా కాలువ వద్ద శనివారం రాత్రి జరిగిన రెడ్డెయ్య హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు మదనపల్లె డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి తెలిపారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేయించినట్టు  తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఆయన సోమవారం పెద్దమండ్యం పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని వెలిగల్లు పంచాయ తీ నడింబురుజుకు చెందిన మండ్యం రెడ్డెయ్య (50) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతని భార్య నాగసుబ్బమ్మ అలియాస్‌ సుబ్బులమ్మ (45) అదే గ్రామానికి చెందిన పి.రసూల్‌ఖాన్‌(45)తో వివా హేతర సంబంధం పెట్టుకుంది.

పలుమార్లు భార్యను మందలించినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. దీంతో భర్తను హతమార్చాలని భార్య నాగసుబ్బమ్మ, ప్రియుడు రసూల్‌ఖాన్‌ నిర్ణయిం చుకున్నారు. శనివారం రాత్రి రెడ్డెయ్యను అదే గ్రా మానికి చెందిన శివారెడ్డి తురకపల్లెకు తన బైక్‌లో తీసుకువచ్చాడు. హంద్రీ–నీవా కాలువ వద్ద మద్యం తాగుతుండగా చెట్ల మాటున ఉన్న రసూల్‌ఖాన్‌ కత్తితో దాడిచేశాడు. రెడ్డెయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య తీరుపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు రసూల్‌ఖాన్, శివా రెడ్డి, నాగసుబ్బమ్మను అరెస్ట్‌ చేసినట్లు తెలి పారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన సీఐ రుషీకేశవ్, ఎస్‌ఐలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement