న్యూస్‌ రీడర్‌ మృతితో విషాదఛాయలు  | Tragedies With The News Reader Dead | Sakshi
Sakshi News home page

న్యూస్‌ రీడర్‌ మృతితో విషాదఛాయలు 

Apr 3 2018 10:44 AM | Updated on Nov 6 2018 8:16 PM

 Tragedies With The News Reader Dead - Sakshi

మానెపల్లిలోని రాధిక ఇల్లు

తూప్రాన్‌: వీ 6 చానెల్‌లో న్యూస్‌రీడర్‌గా పనిచేసిన రాధిక ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. వెల్దుర్తి మండలం మానెపల్లికి చెందిన వెంకన్నగారి మాణిక్యరెడ్డి, ఊర్మిల దంపతుల కుమార్తె రాధిక(36) వీ6 చానెల్‌ న్యూస్‌రీడర్‌గా పనిచేసింది. హైదరాబాద్‌లోని మూసాపేటలోని అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు టీవీల్లో చూసిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.

తమ గ్రామ యువతి టీవీ లో వార్తలు చదవడం తమకెంతో గర్వంగా ఉండేదన్నారు. రాధిక కుటుంబ సభ్యులు పదిహేనేళ్లకు ముందు హైదరాబాద్‌ వెళ్లి స్థిరపడ్డారన్నారు. గ్రామంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని ఆమె తండ్రి మాణిక్యరెడ్డి ఇతరులకు కౌలుకు ఇచ్చినట్లు  గ్రామస్తులు పేర్కొన్నారు. మృతురాలు రాధిక 10వ తరగతి వరకు గ్రామ సమీపంలోని మంగళపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు  తెలిపారు.

తన తోటి విద్యార్థులు సైతం రాధిక మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాం తిని వ్యక్తం చేశారు. గ్రామంలో వారు  ఉంటున్న ఇల్లు  పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయింది.  పదిహేనేళ్లుగా వారు గ్రామానికి రావడం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement