యూపీలో దారుణం.. | Three Teen Brothers Rape Eight Yr Old In UP | Sakshi
Sakshi News home page

యూపీలో దారుణం..

Sep 4 2019 11:25 AM | Updated on Sep 4 2019 11:40 AM

Three Teen Brothers Rape Eight Yr Old In UP - Sakshi

లక్నో : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు బ్రేక్‌ పడటం లేదు. యూపీలోని బాగ్పట్‌ జిల్లా రమలా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదివే ఎనిమిదేళ్ల బాలికపై  ఆరో తరగతి విద్యార్థి తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి స్కూల్‌ వాష్‌రూంలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగినా 15 రోజుల పాటు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసేందుకు స్ధానిక పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధిత బాలిక తండ్రిపై స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌ఓ) నరేష్‌ కుమార్‌ ఒత్తిడి తీసుకువచ్చారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఎస్‌హెచ్‌ఓ తీరును ఉన్నతాధికారులకు వివరించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎస్‌హెచ్‌ఓను తొలగించిన అధికారులు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికపై ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడని, అతని సోదరులు కూడా ఈ నేరంలో పాల్గొన్నారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారని బాగ్పట్‌ ఎస్పీ ప్రతాప్‌ గోపేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. ఘటనపై పూర్థిస్ధాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముగ్గురు నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌ నమోదైందని తెలిపారు. బాలిక కోలుకున్నతర్వాత ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement