సినిమా ప్రేక్షకులతో అసభ్య ప్రవర్తన | Theatre Watchmen Arrest in Harassment Case | Sakshi
Sakshi News home page

సినిమా ప్రేక్షకులతో అసభ్య ప్రవర్తన

Apr 26 2019 7:23 AM | Updated on Apr 26 2019 7:43 AM

Theatre Watchmen Arrest in Harassment Case - Sakshi

తార్నాక: అతను సినిమా థియేటర్‌లో ఓ చిరుఉద్యోగి..అయితే సినిమాకు వచ్చే వారి పట్ల వంకరచూపులు చూస్తాడు.. అదును దొరికితే బెదిరించి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇలా చేస్తూ చివరికు ఓ ప్రేమజంటను కూడా బెదిరించి పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆరాధన థియేటర్‌లో గురువారం జరిగింది. ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి ,బాధితులుతెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇంటర్‌ పూర్తిచేసిన ఓ అమ్మాయి తన మిత్రుడైన ఓ అబ్బాయితో కలిసి తార్నాకలోని ఆరాధన థియేటర్‌లో సినిమా చూస్తున్నారు. 

థియేటర్‌లో గేటుకీపరుగా పని చేస్తున్న వీర్రాజు(29) సినిమా మొదలైన కొద్దిసేపటికి వారి వద్దకు వచ్చాడు. మీరు ఇద్దరు సినిమా థియేటర్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు...ఈ విషయాన్ని నేను సిసీ కెమెరాలో చూశాను .. మీరు బయటకు రండి మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలంటూ బెదిరించాడు. మీ విషయం పోలీసులతో పాటు మీ ఇరు కుటుంబాలకు కూడా చెబుతానంటూ భయపెట్టడం మొదలు పెట్టాడు. తరువాత అబ్బాయిని లోపలికి తీసుకెళ్లి సినిమా చూడమంటూ సీట్లో కూర్చోబెట్టాడు. తరువాత అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.   పోలీసులు సినిమా థియేటరుకు వచ్చి వీర్రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement