కలెక్టరేట్‌ వద్ద కలకలం..

Tension at Nizamabad Collectorate - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిషేధిత సిమి అనుబంధ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) సభ్యులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. నిజామాబాద్‌లో సమావేశం నిర్వహించేందుకు అనుమతి కోసం సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.

పోలీసులు అరెస్టుచేసి విచారణ చేపట్టగా నిషేధిత సంస్థ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై ఒకటవ టౌన్‌ పోలీసులను సంప్రదించగా వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అరెస్టయిన వారిలో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాజిద్, నిజామాబాద్‌కు చెందిన షాదుల్ల ఉన్నట్లు తెలుస్తోంది. పీఎఫ్‌ఐ సంస్థ రాష్ట్ర నాయకుడు ఇటీవల జగిత్యాల్‌లో ఓ వర్గం వారితో సమావేశం నిర్వహించగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top