టీచర్‌ దాష్టికం బాలికకు బధిరత్వం 

Teacher Beats Children In Karnataka - Sakshi

బెంగళూరు: చిన్నారి బాలలను భద్రంగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయురాలు చిన్న విషయానికే కొట్టడంతో ఒక బాలిక జీవితం అంధకారమైంది. చెవి కర్ణభేరి దెబ్బతిని బాలికకు ఇప్పుడు ఏమీ వినిపించడం లేదు. బిడ్డ దుస్థితిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తాను చెప్పిన నోట్సు తేలేదని విద్యార్థినిని ఉపాధ్యాయురాలు చెంపదెబ్బ కొట్టిన కారణంగా బాలలిక వినికిడి శక్తిని కోల్పోయింది. ఎవరు ఏం చెప్పినా బాలికకు వినిపించక దుర్భర పరిస్థితిని చవిచూస్తోంది. ఈ సంఘటన కోలారు జిల్లా కేజీఎఫ్‌ తాలూకాలోని కేతగానహళ్లి ప్రాథమికోన్నత పాఠశాలలో జరగ్గా, ఆలస్యగా వెలుగుచూసింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. పాఠశాలలో 8వ తరగతి చదుతువున్న బోయిసొన్నేనహళ్లి గ్రామానికి చెందిన మునివెంకటేష్‌ కుమార్తె స్వాతి (14) బాధిత విద్యార్థిని. నవంబర్‌ 27వ తేదీన పాఠశాల ఉపాధ్యాయురాలు మంజుళాబాయి 8వ తరగతి విద్యార్థులకు కన్నడ విషయానికి సంబంధించిన నోట్సును తీసుకు రావాలని తెలిపింది. అయితే స్వాతి నోట్సు తీసుకురాలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన ఉపాధ్యాయురాలు... స్వాతి చెంపపై గట్టిగా కొట్టింది. దీంతో విద్యార్థినికి చెవి వినిపించకుండా పోయింది.

పిలిచినా పలకడం లేదని..  
అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి స్వాతి వెనుకంజ వేసింది. అయితే తల్లిదడ్రులు స్వాతిని ఇంట్లో ఎన్నిసార్లు పిలిచిన పకలడం లేదు. అనుమానం వచ్చి ఏం జరిగిందని నిలదీయడంతో పాఠశాలలో ఉపాధ్యాయురాలు కొట్టిన విషయం తెలిపింది. తల్లిదండ్రులు వెంటనే స్వాతిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు స్వాతి కర్ణభేరికి గాయం కావడం వల్ల వినిపించకుండా పోయిందని, శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో పేద తల్లిదండ్రులు అంత ఖర్చు భరించేదెలా అని దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. ఘటనపై వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
బాలికను కొట్టడం తప్పు 
పిల్లలకు ఎట్టి పరిస్థితిలోను కొట్టడానికి వీలులేదనే నియమం ఉన్నా విద్యారి్థనికి చెంప దెబ్బ కొట్టడం తప్పు. పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ చేసి తప్పు జరిగిఉంటే  ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకుంటాం.  – అశోక్, ఇన్‌చార్జి, క్షేత్రశిక్షణాధికారి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top