విద్యార్థినిపై ఉపాధ్యాయుడి దాష్టీకం

Teacher Beaten Sixth Class Student in Chittoor - Sakshi

హైస్కూలు వద్ద తల్లిదండ్రుల ఆందోళన

చిత్తూరు , బుచ్చినాయుడుకండ్రిగ: హోమ్‌ వర్క్‌ చేయలేదని విద్యార్థినిపై ఓ టీచర్‌ ఆగ్రహించాడు. ఆ విద్యార్థిని చేతిని బలంగా మెలితిప్పడంతో తీవ్రగాయంతో ఆస్పత్రి పాలైంది. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాలు..  మండలంలోని చల్లమాంబపురం తమిళం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని సంధ్య హోమ్‌వర్క్‌ చేయలేదని ఉపాధ్యాయుడు రాజా మండిపడ్డారు. ఆ బాలికపై చేయి చేసుకున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థిని ఒకింత అస్వస్థతతో ఇబ్బంది పడుతుండటంపై తల్లిదండ్రులు ఆరా తీసేసరికి జరిగిన ఉదంతాన్ని ఆ బాలిక తెలియజేసింది.

దీనిపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైస్కూలు వద్దకు వద్దకు చేరుకుని ఆందోళన చేశారు.తమ కుమార్తెపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడు రాజా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనతో తరగతులకు అంతరాయం కలిగింది. వారు మాట్లాడుతూ, తమ కుమార్తె సంధ్య హోమ్‌ వర్క్‌ రాయలేదని సోషల్‌ ఉపాధ్యాయుడు రాజా, ఎడమ చేతిని పట్టుకుని బలంగా మెలితిప్పడంతో మోచేతి వద్ద తీవ్ర గాయమైందన్నారు. చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఆసుపత్రికి తీసుకెళ్లామని, వైద్యులు సంధ్య చేతికి కట్టుగట్టి, విశ్రాంతి తీసుకోవాలని మందులు ఇచ్చారన్నారు. విద్యార్థులను మందలించడంలో తప్పులేదని, మరీ గాయాలయ్యేలా కొట్టడం శోచనీయమని నిరసించారు. ప్రధానోపాధ్యాయులు మునిరత్నంనాయుడు బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో శాంతించారు.

ఉపాధ్యాయుడిపై విచారణ
చిత్తూరు ఎడ్యుకేషన్‌ : బీఎన్‌ కండ్రిగ మండలం చల్లమాంబాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల (తమిళం) లో ఉపాధ్యాయుడు ఏ.జే.రాజా తీరుపై విచారణ చేయాలని బుధవారం డీఈఓ పాండురంగస్వామి ఆదేశించారు. 6వ తరగతి విద్యార్థిని సంధ్యపై చేయి చేసుకున్న ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. సంఘటనపై విచారణాధికారిగా ఆ మండల విద్యాశాఖాధికారి రవీంద్రబాబును నియమించారు. విచారణ నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ తెలియజేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top