జడ్చర్ల వద్ద దారి దోపిడీ | Robbery at the jadcherla | Sakshi
Sakshi News home page

జడ్చర్ల వద్ద దారి దోపిడీ

Nov 7 2017 1:16 AM | Updated on Aug 30 2018 5:27 PM

Robbery at the jadcherla - Sakshi

దొంగలు ఉపయోగించిన వాహనం

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సైకిల్‌ విడిభాగాల హోల్‌సేల్‌ వ్యాపారి రామవతార్‌ హైదరాబాద్‌ నుంచి అద్దెకు స్విఫ్ట్‌ డిజైర్‌ కారు తీసుకుని డ్రైవర్‌ కృష్ణకాంత్‌తో కలసి జడ్చర్లకు వచ్చారు. ఇక్కడ సైకిల్‌ దుకాణాల్లో తమకు రావలసిన డబ్బును వసూలు చేసుకుని తిమ్మాజీపేట, వనపర్తి, గద్వాల, ఐజ ప్రాంతాలతో పాటు కర్నూలు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేసుకున్నారు. మొత్తం రూ.5 లక్షల నగదుతో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు.

జడ్చర్ల దాటిన తర్వాత ప్రభుత్వ అతిథి గృహం వద్ద మూత్ర విసర్జనకు కారు నిలిపిన సమయంలో వెనుక నుంచి క్వాలిస్‌ వాహనంలో నలుగురు దుండగులు వచ్చి పిస్టల్, కత్తులను చూయించి బెదిరించారు. కారులో ఉన్న రూ.5 లక్షల నగదుతో పాటు కారును సైతం తీసుకుని పరారయ్యారు. ఈ సమయంలో పిస్టల్‌తో ఓ రౌండ్‌ కాల్చినట్లు కూడా బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండుగులు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు చెప్పారు. ఎస్పీ అనురాధ జడ్చర్లకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  రహదారులపై గాలింపు చర్యలు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement