ఒంటరి మహిళపై పెట్రోల్‌ దాడి.. | Petrol Attack on Single Woman in PSR Nellore | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

Jan 28 2019 9:17 AM | Updated on Sep 3 2019 9:06 PM

Petrol Attack on Single Woman in PSR Nellore - Sakshi

చాతీపై పెట్రోలుపోసి నిప్పు అంటించి పారిపోయాడు.

నెల్లూరు, వాకాడు: వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆదివారం రాత్రి వాకాడు పంచాయతీ గొల్లపాళెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పుటించిన ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ 28 ఏళ్ల మహిళకు వివాహమై భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో గొల్లపాళెం గ్రామానికి చెందిన కావలి కృష్ణయ్య అనే వ్యక్తి ఆమెతో కొద్దికాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు.

వీరిద్దరి మధ్య ఆదివారం కొంత వివాదం చోటుచేసుకోవడంతో తట్టుకోలేని కృష్ణయ్య వాకాడు గురకుల పాఠశాలకు వెళ్లే రహదారి వద్దకు రమ్మని ముఖం, చాతీపై పెట్రోలుపోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ కేకలు వేయడంతో స్థానికులు వాకాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కోటకు తరలించారు. బాధితురాలు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రఘునాథ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement