‘జార్ఖండ్‌ డబ్బు’ దేశవ్యాప్త కుట్ర

NIA Files Chargesheet in Maoists Money Case - Sakshi

పట్టుబడ్డ రూ.25 లక్షలు, అరకేజీ బంగారం కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్‌

సాక్షి, హైదరాబాద్‌ : మావోయిస్టు పార్టీ జార్ఖండ్‌ విభాగం నుంచి రూ.25 లక్షలు, అరకేజీ బంగారం తెలంగాణకు తీసుకువస్తూ దొరికిపోయిన కేసులో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ మంగళవారం రాంచీ సీబీఐ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. మావోయిస్టు పార్టీ కీలకనేత సుధాకర్‌ సోదరుడు బోరెడ్డి నారాయణ గతేడాది ఆగస్టులో ఈ డబ్బులు తరలిస్తుండగా జార్ఖండ్‌ పోలీసులు పట్టుకున్నారు. తదనంతరం ఈ కేసు ఢిల్లీ సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిపిన సీబీఐ పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

జార్ఖండ్‌లోని బీడీ కాంట్రాక్టర్లు, ఇతర వ్యాపార వర్గాల నుంచి మావోయిస్టు సుధాకర్‌ డబ్బులు వసూలుచేసి దేశవ్యాప్తంగా మావోయిస్టుపార్టీ నెట్‌వర్క్‌ విస్తృ తి కోసం పథకం పన్నారని విచారణలో వెల్లడించింది. అదేవిధంగా పోలీస్‌ బృందాలపై దాడు లు చేసి విధ్వంసాలు సృష్టించాలని కుట్ర పన్నిన ట్టు సీబీఐ చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ కేసులో సుధాకర్‌ సోదరుడు నారాయణ, సత్వా జి అలియాస్‌ ఒగ్గు సత్వాజి(మావోయిస్టు), మాధ వి (సుధాకర్‌ భార్య), ప్రభుప్రసాద్‌ సా హు, సుజిత్‌ కేర్వార్‌లపై అభియోగాలు మోపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top