
కర్ణాటక,యశవంతపుర: మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు మురళీధర్ రావ్‌ను కుమారస్వామిలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మురళీధర్ సాహిత్యంతో పాటు మ్యూజిక్ కంపోసింగ్ కూడా చేస్తారు. కుమారస్వామి లేఔట్‌లో సొంతంగా స్టూడియో ప్రారంభించారు. సీరియల్స్‌తో పాటు ప్రకటనల్లో నటించేందుకు ఇస్తానని, తనకు లైంగికంగా సహకరించాలని ఓ మహిళకు సందేశం పంపారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మురళీధర్‌రావును అరెస్ట్ చేశారు.