క్షణికావేశానికి గురై తల్లీకొడుకుల ఆత్మహత్య | Mother And Son Commits Suicide Jadcherla Mahabubnagar | Sakshi
Sakshi News home page

తల్లీకొడుకుల ఆత్మహత్య

Feb 3 2020 10:00 AM | Updated on Feb 3 2020 10:00 AM

Mother And Son Commits Suicide Jadcherla Mahabubnagar - Sakshi

ఎదిరె చిట్టెమ్మ , శ్రీరాం

నవాబుపేట (జడ్చర్ల): క్షణికావేశానికి గురై తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబు పేట మండలం కొల్లూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎదిరె చిట్టెమ్మ (38), నర్సింహులు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ప్రస్తుతం పెద్ద కుమారుడు సిద్ధార్థ డిగ్రీ, చిన్న కుమారుడు శ్రీరాం (17) ఇంటర్‌ చదువుతున్నారు.

కాగా, బాగా చదవాలని శనివారం చిన్న కొడుకును తల్లి మందలించడంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఇరువురు ఆదివారం తెల్లవారుజామున  పురుగు మందు తాగారు. గమనించిన పెద్ద కుమారుడు వెంటనే వారిని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement