తల్లీకూతుళ్లు అదృశ్యం

Mother And Children Missing in Hyderabad - Sakshi

మారేడుపల్లి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో సహా అదృశ్యమైన సంఘటన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్‌మారేడుపల్లికి చెందిన రవికుమార్, శైలజలు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీరికి ఇద్దరు కుమార్తెలు, గత కొన్నాళ్లుగా రవికుమార్‌ భార్యను అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన శైలజ కుమార్తెలు జాహ్నవి, కీర్తితో కలిసి ఇంటినుంచి వెళ్లి పోయింది. శైలజ తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మారేడుపల్లి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top