62 కిలోల గంజాయి స్వాధీనం | Marijuana Smugglers Arrest in East Godavari | Sakshi
Sakshi News home page

62 కిలోల గంజాయి స్వాధీనం

Jan 30 2019 7:48 AM | Updated on Jan 30 2019 7:48 AM

Marijuana Smugglers Arrest in East Godavari - Sakshi

నిందితులను చూపిస్తున్న మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ భరత్‌ మాతాజీ, టూటౌన్‌ సీఐ ముక్తేశ్వరరావు

తూర్పుగోదావరి, సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ ఇన్‌గేట్‌ వద్ద మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు గంజాయి స్మగ్లర్ల వద్ద నుంచి 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ అక్రమణ రవాణా గురించి మహిళ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ భరత్‌ మాతాజీ వివరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ వద్ద సంచులతో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పట్టుకొని ప్రశ్నించగా వారి వద్ద మూడు సంచులతో గంజాయి దొరికిందని తెలిపారు. రాజమహేంద్రవరం సింహాచలనగర్‌కు చెందిన తెపర్తి సత్యనారాయణ ఆటోడ్రైవర్‌గా జీవిస్తూ వీలు కుదిరినప్పుడు ఏజెన్సీ నుంచి గంజాయి రవాణా చేస్తున్నాడని తెలిపారు.

మంగళవారం ఆటోలో ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకొచ్చి కిలో రూ.ఐలు వేలు చొప్పన ముంబైకి చెందిన  స్మగ్లర్లకి అందజేశాడన్నారు. ముంబైకి చెందిన అమర్‌ నాందేవ్‌ పోనాని, నషీరుద్దీన్‌ ఖాన్, అక్షయ లక్ష్మణ్, హుస్సేన్‌ జావేద్‌ షేక్, మహ్మద్‌ అబ్దుల్‌ షేక్‌ తదితరులు ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ ముఠా ఈ గంజాయిని ముంబైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం అర్బన్‌ తహసీల్దార్‌ టి.రాజేశ్వరరావు, అధికారుల సమక్షంలో వీరి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసు చేధనలో టూటౌన్‌ సీఐ ముక్తేశ్వరారవు, పోలీసు సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ కనకరాజు, కానిస్టేబుల్స్‌ ప్రదీప్, వీరబాబు, నాగరాజు, సుమన్, రాజశేఖర్, ప్రసాద్,కరుణబాబు, శ్రీనులను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement