ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం | Man Molestation On Five years old Girl Anantapur | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం

Nov 23 2018 11:36 AM | Updated on Nov 23 2018 11:36 AM

Man Molestation On Five years old Girl Anantapur - Sakshi

నిందితుడు ఆదినారాయణ

కనగానపల్లి: తగరకుంటలో అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై ఓ కామంధుడు అఘాయిత్యం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం స్థానిక అంగన్‌వాడీ కేంద్ర సమీపంలో ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా ఆడుకుంటుండగా  చాకలి ఆదినారాయణ అనే వ్యక్తి ఆ బాలికను అంగన్‌వాడీ కేంద్రంలోని బాత్‌రూంలోకి ఎత్తుకెళ్లి అత్యాచాయత్నం చేశాడు. సమీపంలో ఆడుకొంటున్న పిల్లలు దీనిని గమనించి బాలిక కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వెంటనే వారు అక్కడికి చేరుకొని కామంధుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురువారం నిందితుడిపై నిర్భయ చట్టం కింద ఫోక్సో కేసు నమోదు చేసి కోర్టు ద్వారా రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement