
ప్రశాంత్ పాణిగ్రహి మృతదేహం
జయపురం: జయపురం సమితిలోని ఫూల్‌బెడ గ్రామం సమీపంలో గురువారం రాత్రి మోటార్‌బైక్ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ వ్యక్తిని ఫూల్‌బెడ గ్రామానికి చెందిన ప్రశాంత పాణిగ్రహి(42)గా గుర్తించారు. ప్రాశాంత పాణిగ్రహి టాటా మోటార్స్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
జయపురం–బొరిగుమ్మల మధ్య గల 26వ నంబర్ జాతీయ రహదారిలో టాటా మోటార్స్ కంపెనీ సమీపంలో ప్రశాంత పాణిగ్రహి నడుచుకుంటూ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది . సమాచారం అందిన వెంటనే జయపురం సదర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గా యపడిన ప్రశాంత పాణిగ్రహిని జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన మోటారుబైక్ చోదకుడు పరారయ్యాడు. సదర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం మృత దేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు పోలీసులు అప్పగించారు.