నవవరుడికి చిత్రహింసలు | Harassment on Groom With De Addiction name in Tamil nadu | Sakshi
Sakshi News home page

నవవరుడికి చిత్రహింసలు

Sep 14 2019 8:13 AM | Updated on Sep 14 2019 8:13 AM

Harassment on Groom With De Addiction name in Tamil nadu - Sakshi

నవవరుడి చేతులు కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది

తమిళనాడు, టీ.నగర్‌: డీ అడిక్షన్‌ పేరుతో నవవరుడి చేతులు కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చెన్నై రామవరానికి చెందిన సవరిరాజ్‌ కుమారుడు స్టీఫెన్‌ చక్రవర్తికి చెన్నై క్రోంపేట ఉమయాళ్‌పురానికి చెందిన యువతితో గత 8 మే 2019లో వివాహం జరిగింది. కొద్ది రోజులకు భార్య గర్భవతి అవడంతో మామ ఇంట్లో తెలిపేందుకు స్టీఫెన్‌ చక్రవర్తి భార్యను తీసుకువెళ్లారు. భార్య ను అక్కడ విడిచిపెట్టి వచ్చాడు. తర్వాత భర్త వద్ద నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో భార్య ఇంటివారు స్టీఫెన్‌ చక్రవర్తి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అయితే అతనికి ఆరోగ్యం సరిలేందున ఆస్పత్రిలో చేర్చామం టూ పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో వారిని స్టీఫెన్‌ ఆచూకీ తెలపాలంటూ అత్తమామలు వాగ్వాదానికి దిగడంతో గూడువాంజేరిలోని డీ అడిక్షన్‌ హోంలో ఉన్నట్లు చెప్పా రు. అక్కడ స్టీఫెన్‌ చక్రవరిని డీ అడిక్షన్‌ హోం నిర్వాహకుడు అబ్దుల్‌ సలీం చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న గూడువాంజేరి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement