అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి | Gunman Kills Five People In A Series Of Shootings In California | Sakshi
Sakshi News home page

Sep 13 2018 11:50 AM | Updated on Apr 4 2019 3:25 PM

Gunman Kills Five People In A Series Of Shootings In California - Sakshi

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మరో సారి కాల్పులతో దద్ధరిల్లింది. గుర్తుతెలియన దుండగుడు తుపాకితో  విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి ఐదుగురు అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం తనకు తానుగా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ దుర్ఘటన కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌లో బుధవారం చోటు చేసుకుంది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నిందితుడి భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. 

తొలుత బేకర్స్‌ఫీల్డ్‌లోని ట్రక్కింగ్ కంపెనీ ప్రాంగణంలో తన భార్యతో పాటు మరో వ్యక్తిని కాల్చి చంపాడు. ఆ తరువాత మరో వ్యక్తిని వెంబడించి స్పోర్ట్స్ స్టోర్ సమీపంలో కాల్చి చంపాడు. తన నివాసంలో మరో ఇద్దరి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల తుపాకిని స్వాధీనం చేసుకుని మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు. నిందితుని వివరాలను పోలీసులు  వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement