
రియాద్: గల్ఫ్‌దేశం సౌదీ అరేబియా నగరం జెడ్డాలోని రాజభవనం వద్ద ఒక సాయుధుడు ఇద్దరు భద్రతా భద్రతా సిబ్బందిని కాల్చిచంపగా, మరో ముగ్గురిని గాయపర్చాడు. వెంటనే అప్రమత్తమైన ఇతర భద్రతా సిబ్బంది దుండగుణ్ని హతమార్చారు. ఇతడు ఒక కారు నుంచి దిగివచ్చి కాల్పులకు తెగబడ్డాడని సౌదీ అంతరంగిక మంత్రిత్వశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సౌదీలోని ఐసిస్ ఉగ్రవాదులను ఏరేయడానికి పోలీసులు విస్తృతంగా గాలింపులు జరుపుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.