భారీగా బంగారు బిస్కట్లు స్వాధీనం | Gold biscuits worth Rs 1.5 cr seized from boat off Mandapam | Sakshi
Sakshi News home page

భారీగా బంగారు బిస్కట్లు స్వాధీనం

Nov 20 2017 12:17 PM | Updated on Apr 3 2019 5:24 PM

Gold biscuits worth Rs 1.5 cr seized from boat off Mandapam      - Sakshi - Sakshi

సాక్షి, చెన్నై: సముద్ర మార్గంద్వారా దేశంలోకి అక్రమంగా  రవాణా చేస్తున్న  బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  శ్రీలంక నుంచి బోటులో అక్రమంగా తరలిస్తున్న అయదున్నర కిలోల బంగారం తనిఖీల్లో  పట్టుబడింది.
తమిళనాడులోని రామేశ్వరంలోని మండపం తీరం ద్వారా రవాణా చేస్తుండగా  నిఘా అధికారులు పట్టుకున్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌పై రహస్య సమాచారాన్ని అందుకున్న పోలీసులు,  కస్టమ్స్ శాఖ అధికారులతో కూడిన బృందం శ్రీలంక నుంచి  వస్తున్న పడవను అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన నాజిర్‌ అనే వ్యక్తిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా  అతనినుంచి 5.5 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటిన్నర రూపాయలని  ప్రకటించారు. నజీర్‌ తోపాటు పడవను కూడా స్వాధీనం చేసున్నామని, విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement