
సాక్షి, ముంబై : వాణిజ్య రాజధానిలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం వేకువ ఝామున చోటు చేసుకున్న ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడినట్లు సమాచారం.
మరోల్ చర్చ్ రోడ్‌లోని మైమూన్ అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఏడుగురిని రక్షించినట్లు అధికారి హరి శెట్టి తెలిపారు. 45 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు మొన్నీమధ్య జరిగిన కమలా మిల్స్ కాంపౌండ్ ఘటన తరహాలోనే ఇక్కడ కూడా ఊపిరి ఆడకనే బాధితులు ప్రాణాలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 29న లోవర్ పరెల్ ప్రాంతంలో కమలా మిల్స్ కాంపౌండ్‌లోని పబ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
#WATCH: Visuals of fire that broke out at Maimoon building in #Mumbai's Marol in the late night hours and claimed four lives. Situation now under control pic.twitter.com/nLp0zL9rdU
— ANI (@ANI) 4 January 2018