కుమార్తెను గదిలో బంధించిన తల్లి | The doughter imprisoned in the room | Sakshi
Sakshi News home page

కుమార్తెను గదిలో బంధించిన తల్లి

May 3 2018 1:35 PM | Updated on Sep 2 2018 4:52 PM

The doughter imprisoned in the room - Sakshi

బాలిక నుంచి వివరాలు సేకరిస్తున్న కానిస్టేబుల్‌

సారవకోట : మండలంలోని వెంకటా పురం గ్రామానికి చెందిన కె.అమూ ల్య(11)ను తల్లి సరోజిని చీకటి గదిలో బంధించి వెళ్లిపోయింది. గదిలో ఊపిరాడకపోవడంతో కేకలు వేసింది. వీటిని గమనించిన స్థానికులు గదికి ఉన్న వెంటిలేటరును తొలగించి బాలికను సురక్షితంగా బయటకు తీశారు.

అనంతరం వీరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక నుంచి సమాచారం సేకరించారు. ప్రస్తుతం కోటబొమ్మాళిలో 6వ తరగతి చదువుతోంది. ఎస్‌ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. తల్లికి ఫోన్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement