ఆస్ట్రేలియా వెళ్దామనుకుని అనంతలోకాలకు.. | B Tech student dead in accident | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా వెళ్దామనుకుని అనంతలోకాలకు..

Jan 24 2018 5:47 PM | Updated on Apr 3 2019 8:03 PM

B Tech student dead in accident - Sakshi

మృతిచెందిన ఆశిష్‌, తీవ్రంగా గాయపడిన సాయి

మేడ్చల్‌ రూరల్‌ : బీటెక్‌ పూర్తి చేసిన ఓ విద్యార్థి మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన మంగళవారం రాత్రి మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సంభవించింది. వివరాల.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఆశిష్‌(24), సాయి(23) చదువు నిమిత్తం కొంపల్లిలోని సినీప్లానెట్‌ సమీపంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆశిష్‌ మండలంలోని కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో 2016లో బీటెక్‌ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

సాయి.. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఆశిష్, సాయిలు ఇద్దరు కలిసి తన స్నేహితుడి బైక్‌పై మేడ్చల్‌కు వెళ్తుండగా కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై వీరి బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వారు తప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న ట్రాలీ ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో ఆశిష్‌ అక్కడికక్కడే మృతి చెందగా సాయి తీవ్ర గాయాలకు గురి కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. మేడ్చల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement