‘పశ్చిమ’లో ఘోర రోడ్డు ప్రమాదం

 6 Persons Killed in Road Accident at West Godavari District - Sakshi

లారీని వేగంగా ఢీకొట్టిన వ్యాన్‌

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

మరో ఐదుగురికి తీవ్రగాయాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు, నల్లజర్ల: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలో లారీని ఓ వ్యాన్‌ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన వీరు తిరుమల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తమ్మన నీలకంఠరావు (55), అతని భార్య లక్ష్మి (50), కుమారుడు మణికంఠ, అతని పెద్ద కుమార్తె రమాదేవి, ఆమె భర్త రామకృష్ణ, పిల్లలు రేష్మ, తనేజ, చిన్న కుమార్తె నీలిమ, ఆమె భర్త అప్పలరాజు, పిల్లలు యస్మీన్, జ్ఞానేశ్వర్‌ మొత్తం 11మంది వ్యానులో గురువారం రాత్రి తిరుమల బయల్దేరారు.

మార్గమధ్యంలో అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకుని అక్కడే నిద్రపోయారు. మళ్లీ శుక్రవారం ప్రయాణమయ్యారు. నల్లజర్ల జంక్షన్‌ దాటాక కారును ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని వీరి వ్యాను ఢీకొట్టింది. ప్రమాదంలో నీలకంఠరావు, అతని భార్య, అల్లుళ్లు , మనవరాళ్లు తనూజ(3), జ్ఞానేశ్వర్‌ (9 నెలలు) మృతిచెందారు. నీలిమకు తీవ్ర గాయాలు కాగా తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో, మణికంఠ, యస్వీన్, రేష్మ, రమాదేవి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి బయల్దేరి..
కాగా, జ్ఙానేశ్వర్‌ పుట్టు వెంట్రుకలను తిరుమల శ్రీవారికి సమరి్పంచేందుకు వెళ్లే క్రమంలో కుటుంబ సభ్యులంతా తిరుమల బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు. అప్పలరాజు గాజువాక డిపో ప్రాంతంలో కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తుంటాడు. వ్యానులో సీట్లు తొలగించి కింద పరుపులు వేసి కూర్చునే విధంగా చేసుకున్నారు. టాపుపై లగేజీ కట్టి ఉంచారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నల్లజర్ల దాటాక ఎదురుగా వస్తున్న లారీని అతివేగంగా కుడివైపు వెళ్లి ఢీకొట్టింది. నీలకంఠరావు, అతని భార్య అక్కడికక్కడే మృతిచెందగా మిగతా వారిని తాడేపల్లిగూడెం, ఏలూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

బాధితుల బ్యాగుల్లో యక్కల నాగవెంకట రామకృష్ణ, వడ్డాది రమాదేవి ఆధార్‌ కార్డుల ఆధారంగా వారిని గుర్తించారు. విశాఖ పోలీసులకు సమాచారం అందించి వారి నుంచి వివరాలు సేకరించారు. నీలకంఠరావు, లక్షి్మ, రామకృష్ణ, రమాదేవి, తనూజల స్వగ్రామం పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆదిప్‌రాజు ఉండే పెందుర్తి మండలం రాంపురం కావడంతో ఆయన వెంటనే స్పందించి పోలీసులతో ఫోన్‌లో మాట్లాడారు. పశి్చమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, తహసీల్దారు కనకదుర్గ సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవల్, కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top