ప్రియురాలి తలతో పోలీస్‌ స్టేషన్‌కు.. | 27 Year Old Man Held For Killing Girlfriend In Karnataka | Sakshi
Sakshi News home page

Sep 28 2018 7:57 AM | Updated on Sep 28 2018 7:57 AM

27 Year Old Man Held For Killing Girlfriend In Karnataka - Sakshi

ప్రియురాలి తలతో పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడు

చింతామణి: ప్రియురాలు మరోవ్యక్తితో చనువుగా ఉంటోందని ప్రియుడు ఉన్మాదంతో ఆమెను గొంతు కోసి చంపాడు. తలను మొండెం నుంచి కత్తిరించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక కోలారు– చిక్కబళ్లాపుర సరిహద్దులోని కంచార్లపల్లిలో గురువారం జరిగింది. శ్రీనివాసపురం పట్టణం గఫార్‌ఖాన్‌ వీధికి చెందిన అజీజ్‌ (27) మొబైల్‌ షాపు నడుపుతున్నాడు. ఇతనికి గతంలోనే పెళ్లయింది. అయితే బెంగళూరుకు చెందిన అయూబ్‌ఖాన్‌ కూతురు రోషన్‌ఖానం (24)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే రోషన్‌ఖానం ఇతర పురుషులతో చనువుగా ఉంటోందని అతడు అనుమానం పెంచుకున్నాడు. ఇక ఆమెను అంతమొందించాలని పథకం వేసుకొని గురువారం చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాలో పూజలు చేద్దామని నమ్మబలికి పిలుచుకొచ్చాడు. దర్గాను దర్శించుకున్నాక గ్రామ శివార్లలోని మామిడి తోపు షెడ్‌లోకి వెళ్లారు. అక్కడ అజీజ్‌ వేటకొడవలితో ఆమె గొంతు నరికి తల వేరుచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని బైక్‌పై శ్రీనివాసపురం స్టేషన్‌లో లొంగిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement