
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం గోపాలమిత్ర ఉద్యోగులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్రా ఉద్యోగులు ఈ సందర్భంగా తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించి, వినతపత్రం సమర్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కాగా జిల్లాలో 61వ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది.