సిండికేట్ బ్యాంక్కు నష్టాలు | Syndicate Bank writes off Rs883 crore against fraud | Sakshi
Sakshi News home page

సిండికేట్ బ్యాంక్కు నష్టాలు

May 18 2016 1:03 AM | Updated on Sep 4 2017 12:18 AM

సిండికేట్ బ్యాంక్కు నష్టాలు

సిండికేట్ బ్యాంక్కు నష్టాలు

ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,158 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,158 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలకు, ఇతర అంశాలకు కేటాయింపులు మూడు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్‌కు రూ.417 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది.

ఇక గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.120 కోట్ల నికర నష్టం వచ్చిందని తెలిపింది. 2014-15 క్యూ4లో రూ.715 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2015-16 క్యూ4లో రూ.2,412 కోట్లకు ఎగిశాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,599 కోట్ల నుంచి రూ.6,525 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిండికేట్ బ్యాంక్ 4.7 శాతం ఎగసి రూ.66.5 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement