తగ్గిపెరిగిన ఎస్‌బీఐ ‘రేటు’

State Bank of India hikes home loan rates by 20 bps from May 1 - Sakshi

ఎంసీఎల్‌ఆర్‌ రుణ రేట్లు 0.15% కట్‌; రెపో ఆధారిత గృహ రుణ రేట్లు 0.3% అప్‌

డిపాజిట్లపై వడ్డీరేట్లకు కోత

సీనియర్‌ సిటిజన్‌లకు ప్రత్యేక డిపాజిట్‌ స్కీమ్‌  

ముంబై: బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్‌–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్‌ రిస్క్‌ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్‌బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లమేర ఎస్‌బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది.

  ఎస్‌బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్‌ఆర్‌కో అనుసంధానమై ఉంటాయి.    మరోపక్క, బెంచ్‌మార్క్‌ రుణ రేటు–ఎంసీఎల్‌ఆర్‌ను స్వల్పంగా 0.15% (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది.   ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది.
 
వృద్ధులకు ఊరట: రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్‌ విభాగంలో సీనియర్‌ సిటిజన్లకోసం ‘ఎస్‌బీఐ వియ్‌కేర్‌ డిపాజిట్‌’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది.  ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్‌ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్‌ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్‌ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్‌ సెప్టెంబర్‌ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్‌ చేస్తే 80 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్‌ పాయింట్లకు 30 బేసిస్‌ పాయింట్లు ప్రీమియం) అందుతుంది.

మూడేళ్లలోపు రేటు తగ్గింపు:  మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

ఎన్‌బీఎఫ్‌సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు
కోల్‌కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్‌బీఎఫ్‌సీ (నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని  ఎస్‌బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్‌–మే) మారటోరియం విధించడానికి ఆర్‌బీఐ బ్యాంకింగ్‌కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్‌బీ ఎఫ్‌సీలకు వర్తింపజేసేలా ఆర్‌బీఐ అనుమతి నివ్వడంతో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.

ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి.  ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ...



 

Read also in:
Back to Top