
సాక్షి, ముంబై: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు అనంతరం పుంజుకున్నాయి. కొనుగోళ్లజోష్‌తో సెన్సెక్స్ 100పాయింట్లుకు పైగా ఎగిసింది.ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ కొనుగోళ్లు సెన్సెక్స్ ను 39247 స్తాయికి తీసుకెళ్లాయి. అటు నిఫ్టీ 32 పాయింట్లు ఎగిసి 11694 వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా యస్ బ్యాంక్,కోటక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐతో పాటు యూనీలీవర్, లాభపడుతున్నాయి. జీ టెక్ మహీంద్ర, హిందాల్కో కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు గెయిల్, కోల్ ఇండియా, రిలయన్స్ ఓన్‌జీసీ, మారుతి సుజుకి నష్టపోతున్నాయి.