‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్‌బీఐ | SBI in 'Hall of Shame' of banks funding cluster bomb makers | Sakshi
Sakshi News home page

‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్‌బీఐ

Jun 20 2016 1:45 AM | Updated on Sep 4 2017 2:53 AM

‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్‌బీఐ

‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్‌బీఐ

అంతర్జాతీయంగా ‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల జాబితాలోకి భారత్ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎక్కింది.

క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల జాబితాలోకి భారత్ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎక్కింది. ఈ జాబితాలోకి ఎక్కిన ఏకైక భారత్ బ్యాంకు కేవలం ఎస్‌బీఐ కావడం గమనార్హం. క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణాలను ఇచ్చినందుకుగానే ఈ ‘షేమ్’ జాబితాలో ఎస్‌బీఐ చేరింది. అంతర్జాతీయంగా క్లస్టర్ బాంబు తయారీ కంపెనీలకు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చిన 158 బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లతో పీఏఎక్స్ అనే డచ్ గ్రూప్  ఒక నివేదిక రూపొందించింది.

ఈ జాబితాలో జేపీ మోర్గాన్, బార్క్‌లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూసీ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఏడు క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు 2012 జూన్-2016 ఏప్రిల్ మధ్య 28 బిలియన్ల అమెరికా డాలర్లను రుణంగా అందించాయి.

స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తమ రుణ విధానం ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొనగా, అంతర్జాతీయంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ కంపెనీలకు రుణ మంజూరీలు జరిగినట్లు పీఏఎక్స్  275 పేజీల నివేదికలో తెలిపింది. కాగా ఈ కంపెనీలకు రుణాలిచ్చిన దేశాల జాబితా(బ్యాంకులు)లో తొలుత అమెరికా(74) నిలిచింది. వరుసలో చైనా (29), దక్షిణ కొరియా (26) ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆర్బిటర్ ఏటీకేకు ఎస్‌బీఐ రుణం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement