సోలార్‌ వ్యాపారం ఇక ఈజీ | S Chand sets IPO price band at Rs 660–670 | Sakshi
Sakshi News home page

సోలార్‌ వ్యాపారం ఇక ఈజీ

Apr 20 2017 1:35 AM | Updated on Sep 5 2017 9:11 AM

సోలార్‌ వ్యాపారం ఇక ఈజీ

సోలార్‌ వ్యాపారం ఇక ఈజీ

విద్యా సంబంధ పుస్తకాలను ప్రచురించటంతో పాటు విద్యా సంబంధ సేవలను అందించే ఎస్‌ చాంద్‌ పబ్లిషింగ్‌ కంపెనీ తన ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ధరల శ్రేణిని నిర్ణయించింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సోలార్‌ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించాలని ఉన్నవారికి ఎలాంటి అనుభవం లేకున్నా వ్యాపారం చేసేందుకు వీలుగా ‘సన్‌ప్రో’ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. సౌర విద్యుత్‌ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్‌ ఎనర్జీ భారత్‌లో తొలిసారిగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 150 కంపెనీలు 40 రకాల పరికరాల వివరాలను యాప్‌లో జోడించాయి.

ఔత్సాహిక వ్యాపారులు కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సౌర విద్యుత్‌ పరిష్కారాలను అందించేందుకు వీలుగా యాప్‌ను డిజైన్‌ చేసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సౌరభ్‌ మర్దా తెలిపారు. సహ వ్యవస్థాపకురాలు రాధిక చౌదరితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 80 మంది వ్యాపారులు ఇప్పటి వరకు చేతులు కలిపారని, కంపెనీకి రూ.60 కోట్ల ఆర్డర్‌ బుక్‌ ఉందని చెప్పారు. ఫ్రేయర్‌ ఎనర్జీ 2016–17లో రూ.12 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు ఆశిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement