అతి ఖరీదైన కారు లాంచ్‌..

Rolls-Royce launches its new premium model Phantom in north India at Rs 11.35 cr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్లకు పెట్టింది పేరైన లగ్జరీ కార్‌ మేకర్ రోల్స్‌ రాయిస్‌   పాంథమ్‌  కొత్త ప్రీమియం మోడల్స్‌ను లాంచ్‌  చేసింది. పాంథమ్ ఎనిమిదో ఎడిషన్‌‌గా రెండు వేరియంట్లను   నార్త్‌ ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.5 కోట్లుగా నిర్ణయించింది. ఎక్స్‌టెండెండ్ వీల్ బేస్ వెర్షన్ మోడల్ ధర రూ.11.35 కోట్లుగా  నిర్ణయించింది.   సురక్షితమైన  ప్రయాణ అనుభవాన్ని కస్టమర్లకు అందించేలా   హెడ్‌లైట్లు (లేజర్ లైట్ టెక్నాలజీన) రాత్రిపూట 600 మీటర్ల వెలుతురును అందిస్తాయని కంపెని చెబుతోంది.

ఈ కొత్త జనరేషన్ పాంథమ్‌ను అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ప్లాట్‌ఫాంతో రూపొందించారు. గత మోడల్ కంటే ఇది తేలిగ్గా ఉంటుందట. 6.75 లీటర్ల ట్విన్‌ టర్బో చార్జ్‌డ్‌ వీ 12 ఇంజీన్‌  రూపొందించిన  కారు కేవలం 5.3 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.  విండ్‌స్క్రీన్‌తో  అనుసంధానమైన 'ఫ్లాగ్‌ బేరర్‌' తో కూడిన స్టీరియో కెమెరా సిస్టమ్‌  రోడ్డును చూసి, దానికనుగునంగా సస్పెన్షన్‌ సర్దుబాటు చేస్తుంది.  స్టార్ లైట్ రూఫ్, డోర్లను క్లోజ్ చేసే బటన్లు తదితర ఫీచర్లు   ప్రధానంగా ఉండనున్నాయయి. బిజినెస్ క్లాస్ కస్టమర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభవం అందించనుంది. అంతేకాదు ఈ కార్ల కొనుగోలుపై లాంచింగ్‌ ఆఫర్‌గా  24 గంటల రోడ్ సైడ్ సపోర్ట్ , రీజనల్‌ వారంటీతోపాటు  నాలుగేళ్లపాటు సర్వీస్‌ను  ఉచితంగా అందించనుంది.   జనాభా ఇతర దేశాల కన్నా ఎక్కువ పెరుగుతుండటం , ప్రామాణికమైన, బెస్పోక్ లగ్జరీ  కార్లపై   ఆసక్తి కారణాల రీత్యా ఇండియాలో తమకు   ఆకర్షణీయమైన మార్కెట్‌  నిలుస్తోందని రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్, ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్  పేర్కొన్నారు.  న్యూఢిల్లీలోని సెలెక్ట్‌ కార్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌  ఏకైక అధికార డీలర్‌గా   రోల్స్‌ రాయిస్‌ ఎంచుకుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top