రెడ్‌మి నోట్‌ 7 ప్రొ రంజాన్‌ సేల్‌

Redmi Note 7 Pro Set to Go on Sale in India Today at 4pm IST via Flipkart - Sakshi

 రెడ్‌మి నోట్‌ 7 ప్రొ రంజాన్‌ సేల్‌

 ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ ద్వారా  సాయంత్రం 4 గంటలకు

సాక్షి, న్యూఢిల్లీ : రంజాన్‌ పర్వదినం సందర్భంగా షావోమి స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది. రెడ్‌మి నోట్‌ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈద్‌ స్పెషల్‌గా ప్రత్యేకంగా విక్రయిస్తోంది.  బుధవారం సాయంత్రం నాలుగు గంటలనుంచి  ఈ సేల్‌ ప్రారంభం కానుంది. ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్‌ మొదలవుతుంది. 48 మెగాపిక్స‌ల్ భారీ కెమెరా, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ లాంటివి ప్రధాన ఫీచర్లు. ముందు ప్రకటించిన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు సేల్‌ మొదలు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమయిందని  షావోమి ఇండియా సీఈఓ మను కుమార్‌ జైన్‌ ట్వీట్‌ చేశారు. 

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆండ్రాయిడ్ 9.0 పై
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌
4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
48+5  ఎంపీ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
13 ఎంపీ సెల్ఫీ కెమెరా,
 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ స్టోరేజ్‌  : ధర రూ. 13,999
6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌ : ధర రూ. 16,999

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top