ఐఫోన్‌ ఎక్స్‌పై భారీ ఆఫర్‌

Paytm Mall Freedom Cashback Sale: You Can Get iPhone X In Rs 67298 - Sakshi

ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, మార్కెటింగ్‌ ఆఫర్లతో పేటీఎం మాల్‌ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనిలో భాగంగా ఈ సంస్థ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌ సేల్‌’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ అభిమానుల కోసం ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేసిన ఐఫోన్‌ ఎక్స్‌(64జీబీ)ను కేవలం 67,298 రూపాయలకే విక్రయిస్తోంది. దీని అసలు ధర 92,798 రూపాయలుగా ఉంది.

ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌ సేల్‌లో ఐఫోన్‌ ఎక్స్‌పై ఫ్లాట్‌ 10వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతో ఐఫోన్‌ ఎక్స్‌(64జీబీ) పేటీఎం మాల్‌లో రూ.82,798కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లు తమ క్రెడిట్‌ కార్డుతో ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే అదనంగా మరో 1,250 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది. పాత ఫోన్ల ఎక్స్చేంజ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్‌ ఎక్స్‌ ధర మరో రూ.14,250 తగ్గుతోంది. దీంతో మొత్తంగా ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర 67,298 రూపాయలకు దిగొస్తోంది. 

మరోవైపు పేటీఎం మాల్‌ నిర్వహిస్తున్న సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌ కలిగిన డెల్‌ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్‌ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. ఎంఎస్‌ఐ జీఎల్‌63 8ఆర్‌ఈ-455ఐఎన్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్‌ తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎంక్యూడీ42హెచ్‌ఎన్‌/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్‌ సర్‌ఫేస్‌ ప్రొ కోర్‌ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంది.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top