ఉద్యోగాల కోతపై టీసీఎస్‌ స్పందన

ఉద్యోగాల కోతపై టీసీఎస్‌ స్పందన

బెంగళూరు : దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) లక్నోలోని తన కేంద్రాన్ని మూసివేయనుందని, ఈ మూతతో వేలకొద్ది ఉద్యోగులు రోడ్డున్న పడనున్నారని రిపోర్టులు ఊపందుకున్నాయి. ఈ రిపోర్టులను టీసీఎస్‌ కొట్టిపారేసింది. ల​క్నోలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసివేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సిటీలోని సెంటర్‌ను మూసివేస్తున్నట్టు తెలిపింది. లక్నోలోని తమ కంపెనీ వ్యాపారాలపై నిరాధారమైన రూమర్లు, రిపోర్టులు మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్నాయని, ఎలాంటి ఉద్యోగాల కోత ఉండదని కూడా టీసీఎస్‌ తేల్చిచెప్పింది. నోయిడాలో తమ యూపీ కార్యకలాపాలను సంఘటితం చేస్తున్నామని తెలిపింది.  నోయిడా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సెంటర్‌లలో లక్నో సెంటర్‌ ఉద్యోగులకు అవకాశాలు కల్పించనున్నామని పేర్కొంది. లక్నోలోని ఏ ఉద్యోగులను తీసివేసే ప్రసక్తే లేదని టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజేష్‌ గోపినాథ్‌ స్పష్టంచేశారు.

 

 ''ఎలాంటి లేఆఫ్స్‌ లేవు. యూపీలో తమ వ్యాపారాలు వృద్ధి పరుచుకోవాలని చూస్తున్నాం. ఈ క్రమంలోనే నోయిడాలో తమ కార్యకలాపాలను సంఘటితం చేస్తున్నాం'' అని పేర్కొన్నారు. జూన్‌ వరకు తమ కంపెనీలో దేశవ్యాప్తంగా 3,85,809 మంది ఉద్యోగులున్నట్టు టీసీఎస్‌ తెలిపింది.  అయితే గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాలపై తక్కువగానే ఫోకస్‌ చేసినట్టు టీసీఎస్‌ గ్లోబల్‌ హ్యుమన్‌ రిసోర్స్‌ హెడ్‌, ఈవీపీ అజయ్ంద్ర ముఖర్జీ వివరించారు. ప్రస్తుతం తాము ట్రైనింగ్‌వైపే ఎక్కువగా దృష్టిసారించినట్టు వెల్లడించారు. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top