
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి తమకు మూలధన నిధుల సాయం అవసరం లేదని, తగినన్ని నిధుల లభ్యత ఉందని ప్రభుత్వరంగ ఎస్‌బీఐ తెలిపింది. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు, రుణ వితరణ సామర్థ్యం ఇనుమడింపజేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు తక్షణమే రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీవోకు వస్తుందని.. నిధుల సమీకరణలో ఇదీ ఒక భాగమేనని ఎస్‌బీఐ ఎండీ అరిజిత్ బసు చెప్పారు.