మత్తు బిజినెస్ లోకి మైక్రోసాప్ట్..? | Microsoft enters the marijuana business | Sakshi
Sakshi News home page

మత్తు బిజినెస్ లోకి మైక్రోసాప్ట్..?

Jun 18 2016 4:10 PM | Updated on Oct 9 2018 2:23 PM

మత్తు బిజినెస్ లోకి మైక్రోసాప్ట్..? - Sakshi

మత్తు బిజినెస్ లోకి మైక్రోసాప్ట్..?

ప్రపంచ సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ మొదటిసారి ఓ కొత్తరకమైన భాగస్వామ్యం కుదుర్చుకుంది.

వాషింగ్టన్ : ప్రపంచ సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ మొదటిసారి ఓ కొత్తరకమైన భాగస్వామ్యం కుదుర్చుకుంది. మత్తుపదార్థం మారిజునా ను సీడ్ నుంచి అమ్మకాల వరకు చట్టబద్ధంగా ట్రాక్ చేయడానికి వ్యాపారాలకు, ప్రభుత్వ ఏజెన్సీలకు సాయ పడుతున్న కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ కైండ్ ఫైనాన్సియల్ తో మైక్రోసాప్ట్ జతకట్టింది.  మైక్రోసాప్ట్ చరిత్రలోనే ఇలాంటి భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. మూడేళ్ల నుంచి ప్రభుత్వాలకు, వ్యాపారాలకు మారిజునా ట్రాకింగ్ సాప్ట్ వేర్ ను కైండ్ విక్రయిస్తోంది. ఈ డీల్ తో ఇకనుంచి ఈ స్టార్టప్ కంపెనీ మైక్రోసాప్ట్ ప్రభుత్వ క్లౌడ్ తో కలిసి పనిచేయనుంది. దానికి కావాల్సిన సాప్ట్ వేర్ ను మైక్రోసాప్ట్ అందించనుంది. మైక్రోసాప్ట్ సంస్థ ఈ విషయాన్ని బీబీసీకి ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ప్రభుత్వ కస్టమర్లు, పార్టనర్లు వారి మిషన్లను చేరుకోవడానికి మైక్రోసాప్ట్  సపోర్టు చేయనుంది. మారిజునాను మెడికల్ లేదా రీక్రేషనల్ పరంగా చట్టబద్దంగా వాడుకోవడానికి స్టేట్స్ కు మైక్రోసాప్ట్ సాయపడనుంది. ఈ డీల్ తో మైక్రోసాప్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ లోకి మారిజునా ఇప్పుడు కొత్త ఉత్పత్తిగా వచ్చి చేరింది.

కానీ ఇప్పటివరకూ చాలా ప్రధాన కంపెనీల్లో మారిజునా వివాదస్పదంగానే ఉంది. ఫెడరల్ ప్రభుత్వ పరంగా ఈ మత్తుపదార్థం అమ్మకం న్యాయసమ్మతి కాకపోయినా.. కొన్ని స్టేట్స్ పరిధిలో మారిజునాను చట్టబద్ధం చేశారు. ఈ పదార్థం వాడుకలోకి తేవడానికి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. కొన్నివ్యాధులను తగ్గించడానికి, లక్షణాలను మెరుగుపర్చేలా చేయడానికి ఈ మత్తుపదార్థాన్ని ఔషధంగా వాడుతున్నారు. అయితే దీనివల్ల స్వల్పకాలికంగా, దీర్థకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు వాదిస్తున్నారు. అమెరికాలో ఎక్కువగా ఈ మత్తుపదార్థాన్ని వాడుతున్నారు. మైక్రోసాప్ట్ వాషింగ్టన్ చెందిన కంపెనీ. అక్కడ మారిజునా చట్టబద్ధం. కాని బిస్ కంప్లైయన్స్ ప్రోగ్రామ్స్ నియంత్రిస్తూ.. ప్రభుత్వ ప్రమాణాలను చేరుకోవడానికి మైక్రోసాప్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ ఒకటిగా నిలవబోతుందని కైండ్ తెలిపింది. విజయవంతంగా ప్రభుత్వ కస్టమర్ల రెగ్యులేటరీ ప్రోగ్రామ్ లు చేపట్టడానికి సహకరిస్తామని మైక్రోసాప్ట్ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement