దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆరంభం నష్టాల నుంచి కోలుకున‍్న మార్కెట్లు వీకెండ్ లో పాజిటివ్‌గా ముగిశాయి. ప్రధానంగా జీఎస్టీ భయంతో వార్షిక కనిష్టాన్ని తాకిని మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. చివరి అరగంటలో బౌన్స్ బ్యాక్ అవడం విశేషం. సెన్సెక్స్ 64 పాయింట్లు ఎగిసి 30, 921 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 9520 వద్ద ముగిశాయి.ముఖ్యంగా సెన్సెక్స్ 31వేలకు దిగువన ఎండ్ కాగా, నిఫ్టీ 9500కు పైన స్థిరంగా ముగిసింది. జీఎస్‌టీ అంచనాలతో ఐటీసీ, జ్యువెల్లరీ షేర్లు ఆల్ టైం హై స్థాయిలను నమోదు చేశాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు లాభాలుమార్కెట్‌కు ఊతమిచ్చాయి. రియల్టీ, ఆటో, బ్యాంకింగ్ కౌంటర్లు బలహీనంగా కదులుతున్నాయి.
ఐటీసీ, సన్‌ఫార్మ, సిప్లా, టాటాస్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, హీరోమోరో కార్పొరేషన్, బజాజ్, బీవోబీ, ఐటీసీ, బీపీసీఎల్, అరబిందో, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, యస్‌బ్యాంక్, లాభాల్లో ముగియగా టెక్ మహాంద్రా, టాటా మోటార్స్, ఐబీ హౌసింగ్, భారతీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ, ఐషర్, నష్టపోయాయి.
అటు డాలర్‌మారకంలో రూపాయి.0.05 పైసలు నష్టపోయి 64.68 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం పది గ్రా. రూ.123 కోల్పోయి రూ.28, 485 వద్ద ముంది.