కాఫీ డే రేసులో లేము: ఐటీసీ

ITC React on Coffeeday Sales - Sakshi

న్యూఢిల్లీ: రుణభారంలో ఉన్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ను (సీడీఈ) కొనుగోలు చేయబోతోందన్న వార్తలను వ్యాపార దిగ్గజం ఐటీసీ ఖండించింది. సీడీఈ కొనుగోలు రేసులో తాము లేమని స్పష్టం చేసింది. ‘ఐటీసీకి ఇలాంటి ప్రతిపాదనలు తరచూ వస్తుంటాయి. వాటిని పరిస్థితులను బట్టి మదింపు చేయడం జరుగుతుంటుంది. కేఫ్‌ కాఫీ డేకి సంబంధించి ఒక మధ్యవర్తిత్వ సంస్థ నుంచి ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. అయితే, ఈ విషయంలో ఎలాంటి పురోగతి మాత్రం లేదు‘ అని ఐటీసీ ప్రతినిధి తెలిపారు. రూ. 4,970 కోట్ల రుణభారం ఉన్న కాఫీ డే గ్రూప్‌ ప్రమోటరు వీజీ సిద్ధార్థ జూలైలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్థిక సమస్యలే కారణమనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రుణభారాన్ని తగ్గించుకోవడానికి సీడీఈ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ అసెట్స్‌ను విక్రయించడంపై దృష్టి సారిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top