క్యూ2లో హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్‌

HDFC Q2 net profit surges 60 percent to Rs 3,961 crore - Sakshi

నికరలాభం 61 శాతం అప్‌

10 శాతం ఎగిసిన ఆదాయం

సాక్షి, ముంబై:  హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) బ్యాంక్ మంచి ఫ‌లితాల‌ను క‌న‌బ‌రిచింది. 2019 సెప్టెంబర్ 30 తో ముగిసిన రెండవ త్రైమాసికంలో తన నికర లాభంలో రూ .3,961.53 కోట్లకు 60.57 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 2,467.08 కోట్ల రూపాయల నికర లాభాన్నిగడించినట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌ సమాచారంలో తెలిపింది. 

క్యూ2లో నిర్వహణ ఆదాయం 10శాతం వృద్ధి చెంది రూ.10,478.33 కోట్లను సాధించింది. గతేడాది క్యూ2లో రూ.9,494.70 కోట్లుగా నమోదైంది. ఈ క్వార్టర్‌లో నికర వడ్డీ మార్జిన్‌ 3.3శాతంగా ఉంది. రుణ వృద్ధి 12శాతం జరిగింది. నికర వడ్డీ ఆదాయం గతేడాది క్యూ2లో సాధించిన రూ.2,594 కోట్లతో పోలిస్తే 16.5శాతం పెరిగి రూ.3,021 కోట్లను ఆర్జించింది. ఇక ఇదే కాలంలో మొండి బకాయిలకు రూ.754 కోట్ల ప్రోవిజన్లు కేటాయించింది. కాగా గతేడాది క్యూ2లో రూ.890 కోట్లను కేటాయించింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పీఏలు 1.29శాతం నుంచి 1.33శాతానికి పెరిగాయి. జూన్‌ క్వార్టర్‌లో రూ.5,315 కోట్లు నమోదు కాగా, ఈ క్వార్టర్‌ నాటికి రూ.5,655 కోట్లకు పెరిగాయి. ఇదే క్వార్టర్‌లో పన్ను వ్యయం రూ.568 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే క్యూ2లో రూ.1,022 కోట్లుగా నమోదైంది. సగటు రుణ పరిమాణం విలువ తగ్గినట్లు బ్యాంక్ తెలిపింది. రుణాలలో 76 శాతం వాటా వ్యక్తిగతమైనవేనంటూ కంపెనీ తెలియజేసింది. వ్యక్తిగత రుణాలలో 17 శాతం పురోగతిని సాధించినట్లు తెలియజేసింది. ఈ ఫలితాల వెల్లడితో హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2 శాతానికిపైగా లాభాలతో ముగిసింది.

హెచ్‌డిఎఫ్‌సి తన అనుబంధ సంస్థ గ్రుహ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గ్రుహ్) లో దాదాపు 10 శాతం వాటాను విక్రయించింది. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు బంధన్ బ్యాంకులో విలీనం కోసం అనుబంధ సంస్థలో ఉన్న హోల్డింగ్‌ను తగ్గించాలని. ఈ త్రైమాసికంలో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, అహ్మదాబాద్ ,  కోల్‌కతా బెంచ్‌లు  గ్రుహ్‌ను బంధన్ బ్యాంక్‌తో కలిపే పథకానికి ఆమోదం తెలిపినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top