తగ్గిన వెండి, బంగారం ధర

Gold slips below Rs 32,000 on global cues, plunges Rs 405 - Sakshi

రూ.32వేలనుంచి దిగి వచ్చిన బంగారం

రూ. 41వేల  దిగువకు  వెండి

రూ. 405 పడిన పుత్తడి ధర

సాక్షి, ముం‍బై:  బంగారం ధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి.  ఇన్వెస్టర్ల అమ్మకాలతో సోమవారం బులియన్ ట్రేడింగ్ లో బంగారం ధరలు  32వేల రూపాయల స్థాయినుంచి దిగువకు దిగి వచ్చాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, డాలర్‌ మారకంలో  రూపాయి  బలపడటంతో వెండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి.10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 405 తగ్గి రూ. 31,965కు పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, దేశీయ మార్కెట్లో పసిడికి డిమాండ్‌  పడిపోయిందని బులియర్‌ ట్రేడర్లు తెలిపారు.  సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ .24,800 వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.38 శాతం పడిపోయి 1,296.20 డాలర్లకు చేరుకుంది.  దేశ రాజధానిలో, 99.9 ,  99.5 శాతం స్వచ్ఛత బంగారం  ధర రూ .405 క్షీణించి రూ .31,965, రూ. 31,815 స్థాయికి పడిపోయాయి.

మరోవైపు వెండి ధరలు కూడా  ఇదే  ధోరణిని కనబర్చాయి. కిలో వెండి  ధర రూ.41వేల మార్క్‌నుంచి దిగి వచ్చింది. రూ. 370 తగ్గి రూ. 40,830కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో  ఔన్సు వెండి ధర 16.51 డాలర్లకు పడిపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top