రూ 40,000కు చేరిన పసిడి | Gold Prices Touch New High | Sakshi
Sakshi News home page

రూ 40,000కు చేరిన పసిడి

Aug 26 2019 2:02 PM | Updated on Aug 26 2019 2:06 PM

Gold Prices Touch New High - Sakshi

బంగారం ధరలు భగ్గుమన్నాయి. ముంబై మార్కెట్‌లో పదిగ్రాముల పసిడి రూ 40,000 దాటి సరికొత్త శిఖరాలకు చేరింది.

ముంబై : బంగారం ధరలు సరికొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెడుతోంది. ముంబైలో సోమవారం పదిగ్రాముల బంగారం రూ 40,000 దాటింది. వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే రూ 41,000 దాటుతాయని జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ బచ్‌రాజ్‌ బమాల్వా చెప్పారు. పసిడి ధరలు పైపైకి ఎగబాకినా పండుగ సీజన్‌తో పాటు రాబోయే  పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో డిమాండ్‌పై పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని, పాత బంగారం రీసైక్లింగ్‌ పెరిగిందని ముంబై జ్యూవెలర్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌ శెట్టి చెప్పారు. ఇక దీపావళి నాటికి పదిగ్రాముల పసిడి రూ 41,000కు చేరుతుందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement