నుబియా నుంచి అధునాతన గేమింగ్‌ ఫోన్‌ | Gaming Smartphone From Nubia Red magic | Sakshi
Sakshi News home page

నుబియా నుంచి అధునాతన గేమింగ్‌ ఫోన్‌

Jun 18 2019 8:43 AM | Updated on Jun 18 2019 8:43 AM

Gaming Smartphone From Nubia Red magic - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన నుబియా భారత్‌లో రెడ్‌మ్యాజిక్‌ 3 పేరుతో ప్రపంచంలోనే తొలిసారిగా యాక్టివ్‌ కూలింగ్‌ వ్యవస్థతో కూడిన గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. గేమింగ్‌ సమయంలో ఫోన్‌లో ఉత్పన్నమయ్యే వేడిని బయటకు పంపి చల్లబరిచేందుకు అంతర్గతంగా ఫ్యాన్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో గేమ్‌బూస్ట్‌ బటన్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్, 6.65 అంగుళాల అల్ట్రా వైడ్‌ స్క్రీన్, 90హెచ్‌జెడ్‌ రీఫ్రెష్‌ రేట్‌తోకూడిన అమోలెడ్‌ డిస్‌ప్లే, 4డీ వైబ్రేషన్, ముందు భాగంలో రెండు స్టీరియో స్పీకర్లు, 27వాట్ల క్విక్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకాలు మొదలవుతాయని, ధర రూ.35,999గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement