బడ్జెట్‌ బిగ్గెస్ట్‌ గిఫ్ట్‌ : భారీగా ఉద్యోగాలు

This budget's biggest gift to India: 5 million new jobs every year - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ ప్రజలకు అతిపెద్ద కానుకను అందించబోతుంది. ప్రభుత్వ మౌలిక సదుపాయల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ పథకాలతో ఏడాదికి కనీసం 50 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని బడ్జెట్‌ డేటా అనాలసిస్‌లో తెలిసింది. అంటే దేశంలో ప్రతేడాది చేరుతున్న కోటి మంది వర్క్‌ఫోర్స్‌లో సగం మంది వీరే కాబోతున్నారని వెల్లడైంది. బడ్జెట్‌లో పొందుపరిచిన హైవేలు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ కింద టాయిలెట్ల నిర్మాణం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం, కోల్డ్‌ చెయిన్స్‌, ఫుడ్‌ పార్క్‌లు, ప్రధాన్‌ మంత్రి రోజ్‌గార్‌ ప్రోత్సాహన్‌ యోజన వంటి వాటివల్ల భారీగా ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడైంది. ప్రభుత్వ పనితీరులో ఉద్యోగాల సృష్టి అనేది ఎంతో ముఖ్యమైన కొలమానమని అనాలసిస్‌ పేర్కొంది. సొంత కార్యక్రమాలతోనే ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఉద్యోగాలను కల్పించనుందని సీనియర్‌ ప్రభుత్వ ఉద్యోగి కూడా తెలిపారు. 

గురువారం రోజు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఎస్‌బీఎం కింద 2 కోట్ల టాయిలెట్లను సృష్టించనున్నాని తెలిపారు. దీనికి 16.92 కోట్ల మండీలు కావాలన్నారు. 51 లక్షల గృహాలు నిర్మించాల్సి ఉందన్నారు. దీనికి కూడా 46.55 మండీలు అవసరం పడుతుందన్నారు. పీఎంజీఎస్‌వై కింద గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణం కోసం 28.35 కోట్ల మండీలు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద పని కోసం 230 కోట్ల మండీలు... మొత్తంగా 321.8 కోట్ల మండీలు అవసరమని తెలిపారు. కేవలం గ్రామీణ మౌలిక  సదుపాయాలతోనే 12.89 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నామని, అంతేకాక ఫుడ్‌పార్క్‌ల కింద ప్రత్యక్షంగా, పరోక్షంగా 95వేల ఉద్యోగాలు, కోల్డ్‌ చైన్స్‌, వ్యవసాయానికి ఇతర మౌలిక సదుపాయాలకు 75వేల ఉద్యోగాలు, ప్రధాన మంత్రి ఎంప్లాయీమెంట్‌ జనరేషన్‌ ప్రొగ్రామ్‌ కింద 294,000 ఉద్యోగాలు సృష్టించబోతున్నట్టు పేర్కొన్నారు. భారత్‌మాల కింద రోడ్ల నిర్మాణంలో 10 లక్షల ఉద్యోగాలు, ప్రధాన్‌మంత్రి రోజ్‌గార్‌ ప్రోత్సాహన్‌ యోజన కింద 30 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామని చెప్పారు. దీంతో ఈ సారి బడ్జెట్‌లో ఉద్యోగాల సృష్టికి భారీగానే బూస్ట్‌ అందించనట్టు వెల్లడైంది. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top