అపోలో హాస్పిటల్స్‌ లాభం రూ. 67 కోట్లు 

Apollo Hospitals Profit Rs. 67 crores - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ నికర లాభం (స్టాండెలోన్‌ ప్రాతిపదికన) సుమారు 7 శాతం క్షీణించి రూ. 67 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సంస్థ నికర లాభం రూ. 73 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 1,681 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు పెరిగింది.

విభాగాలవారీగా చూస్తే హెల్త్‌కేర్‌ సర్వీసుల విభాగం ఆదాయం రూ. 892 కోట్ల నుంచి రూ. 1,008 కోట్లకు, ఫార్మసీ విభాగం రూ. 789 కోట్ల నుంచి రూ. 888 కోట్లకు పెరిగినట్లు అపోలో హాస్పిటల్స్‌ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 1,600 కోట్ల నుంచి రూ. 1,806 కోట్లకు పెరిగినట్లు వివరించింది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top