
అపోలో ఆస్పత్రి వైద్యురాలి ఘనత
దేశంలో తొలి మహిళా సర్జన్ గా గుర్తింపు
హైదరాబాద్: బెనిన్ గైనకాలజీ వైద్య విభాగంలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నట్లు జూబ్లీహిల్స్ లోని అపొలో ఆస్పత్రి సగర్వంగా ప్రకటించింది. ఆస్పత్రికి చెందిన గైనకాలజీ, రోబోటిక్ సర్జరీ వైద్యురాలు, సీనియర్ కన్సల్టెంట్ డా. రూమా సిన్హా నేతృత్వంలో నిరంతరాయంగా, అపాయం లేని రీతిలో, రోగి ఆరోగ్య పరిస్థితిలకు తగినట్లుగా 1000 కంటే ఎక్కువగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఈ విభాగంలో డాక్టర్ రుమా సిన్హా దేశంలోనే అత్యధిక సర్జరీలు చేసిన వైద్యురాలుగా నిలిచారు.
సంక్లిష్ట ఫైబ్రాయిడ్లు, అధునాతన ఎండోమెట్రియోసిస్ చికిత్సలో నిపుణురాలైన డాక్టర్ రుమాసిన్హా రోబోటిక్ సహాయక గైనకాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. డా. రూమా సాధించిన విజయం.. వ్యక్తిగత శస్త్రచికిత్స ఘనత మాత్రమే కాకుండా మనదేశంలోని మహిళలకు కనిష్టంగా ఇన్వేసివ్, సంతానోత్పత్తిని కాపాడే సంరక్షణలో పరివర్తనాత్మకమైన ముందడుగును సూచిస్తుంది. ఈ సందర్భంగా అపొలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీత రెడ్డి మాట్లాడుతూ, భారత దేశంలో రోబోటిక్ సర్జరీ విభాగంలో అపోలో ఆస్పత్రి స్థానాన్ని అగ్రస్థానంలో నిలపడంలో ఈ విజయం విశదీకరిస్తుందన్నారు.
మహిళల ఆరోగ్య సంరక్షణ, వారి జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరచగలమో డా. రుమా ప్రయాణం వివరిస్తుందని ప్రశంసించారు. తెలంగాణ ప్రాంత అపొలో ఆస్పత్రుల సీఈవో తేజస్వి రావు మాట్లాడుతూ, నూతన సాంకేతికతలను స్వీకరించడం, తగిన స్థాయిలో అమలు పరచడం ద్వారా అపొలో జూబ్లీహిల్స్ ఆస్పత్రి తన స్థాయిని పెంచుకుందన్నారు. డా. రుమా సాధించింది.. నైపుణ్యం యొక్క విజయం మాత్రమే కాదని, ఈ అంశంపై సునిశితతమైన దృష్టి సారించడం అని అన్నారు. మనదేశంలో రోబోటిక్ గైనకాలజీని ప్రధాన స్రవంతి లోకి తీసుకువచ్చేందుకు ఆమె ఎంతగానో కృషి చేసిందని ప్రశంసించారు.