ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌

Airtel Reduced Number Of Days A Subscriber Can Receive Calls After The Validity Expires - Sakshi

న్యూఢిల్లీ : సబ్‌స్ర్కైబర్లకు మొబైల్‌ దిగ్గజం ఎయిర్‌టెల్‌ షాక్‌ ఇచ్చింది. వ్యాలిడిటీ ముగిసిన తర్వాత 15 రోజుల వరకూ సబ్‌స్ర్కైబర్‌ ఇన్‌కమిం‍గ్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు దాన్ని వారం రోజులకు కుదించింది. కనీస రీచార్జ్‌ స్కీమ్‌లో  ఎయిర్‌టెల్‌ ఈ మార్పులు చేసింది. దీంతో ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ తాను ఎంచుకున్న ప్లాన్‌ ముగిసిన తర్వాత వారం రోజుల వరకే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుంటారు.

మరోవైపు అకౌంట్‌ బ్యాలెన్స్‌ ఉన్నా సబ్‌స్ర్ర్కైబర్లు వ్యాలిడిటీ ముగిసిన తర్వాత రీచార్జ్‌ చేయకపోతే వాయిస్‌ కాల్స్‌ చేసుకోలేరు. యూజర్‌ నుంచి సగటు రాబడి (ఏఆర్‌పీయూ) పెంచుకునేందుకే ఎయిర్‌టెల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ ప్రీపెయిడ్‌ సబ్‌స్ర్కైబర్ల కోసం వొడాఫోన్‌, ఐడియా కూడా ఈ దిశగా యోచిస్తున్నట్టు సమాచారం. ఎయిర్‌టెల్‌ నిర్ణయంతో సబ్‌స్ర్కైబర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మళ్లవచ్చని భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top