ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ర్టేషన్ ముంబై అధికారులు కొరడా ఝళిపించారు. ఎఫ్డీఏ మార్గదర్శకాలను ఉల్లఘించిన కేసులో థానే లో సుమారు 181 ఆహార సంస్థలు లైసెన్సులను రద్దుచేశారు.
ముంబై: ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ర్టేషన్ ముంబై అధికారులు కొరడా ఝళిపించారు. ఎఫ్డీఏ మార్గదర్శకాలను ఉల్లఘించిన కేసులో థానే లో సుమారు 181 ఆహార సంస్థలు లైసెన్సులను రద్దుచేశారు. ఆహార నమూనాలను పరీక్షించిన మీదట ఎఫ్డీఎ నిబంధనలను పాటించని సంస్థల లైసెన్సు లను రద్దు చేసినట్టు ఎఫ్డీఏకొంకణ్ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నాపూర్ తెలిపారు. గత ఏడాది సేకరించిన నమూనాల్లో 105 నాసిరకమైనవి, 30 మానవ వినియోగం పనికిరానివి ఉన్నట్టు తేలాయని చెప్పారు ఈనేపథ్యంలో ఆయా సంస్థలపై సుమారు 40 క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు.
థానే జిల్లా కలెక్టర్ మహేంద్ర కల్యాణ్ కర్ అధ్యక్షతన సమావేశం సోమవారం జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడి చేశారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారినుంచి సుమారు లక్షన్నర రూపాయల జరిమానా వసూలు చేశామన్నారు. రాబోయే వర్షాకాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో తినుబండారాలు విక్రయ సంస్థలపై దృష్టిపెట్టాలని థానే కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపక్కన స్టాల్స్, హోటళ్ళు , ధాబాల్లో తనిఖీ లు చేపట్టాలని ఆదేశించారు. హానికర ఆహార వినియోగం కారణంగా పరిశుభ్రత లోపించి రోగాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. రోగాల నివారణకు అవగాహన ప్రచార ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినవారికై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.