గ్రహం అనుగ్రహం(19-08-2019) | Daily Horoscope in Telugu(19-08-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(19-08-2019)

Aug 19 2019 4:43 AM | Updated on Aug 19 2019 4:43 AM

Daily Horoscope in Telugu(19-08-2019) - Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. శ్రావణ మాసం. తిథి బ.చవితి రా.11.50 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాభాద్ర సా.5.45 వరకు, తదుపరి రేవతి. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ప.12.27 నుంచి 1.20 వరకు, తదుపరి ప.2.58 నుంచి 3.51 వరకు. అమృత ఘడియలు ప.12.28 నుంచి 1.56 వరకు

సూర్యోదయం : 5.46,
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: పనులలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం: కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘం లో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం

కర్కాటకం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో  నిరుత్సాహం. దైవదర్శనాలు..

సింహం:విద్యార్థుల యత్నాలు అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య:నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఉద్యోగప్రాప్తి.

తుల:కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. కళాకారులకు అవార్డులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.

మకరం: రుణాలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటా యి. వస్తు్త, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కుంభం: పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం:శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement